హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపకశాఖ నూతన డీజీగా విక్రమ్‌సింగ్ మాన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ డీజీగా ఉన్న వై నాగిరెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ అగ్నిమాపకశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించి.. వారి నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.