హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గుండు విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. 2008 నుంచి ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్ ఆవిష్కరించిన ప్రీ ప్రైమరీ మోడల్‌ను గుర్తించి సెలెక్ట్ చేసింది.
ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఆయనకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు.