హైదరాబాద్, జూలై 29 : ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI), దక్షిణ భారత ప్రాంతీయ మండలి (SIRC) ఛైర్మన్గా విజయ్ కిరణ్ అగస్త్య 2025–26 కాలానికి ఎన్నికయ్యారు. డెలాయిట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన విజయ్ కిరణ్ ప్రస్తుతం కెరీర్ గైడెన్స్ అలాగే అప్స్కిల్లింగ్పై దృష్టి సారించిన ఎడ్ టెక్ (EdTech) వెంచర్ అయిన మెంటర్మీ (MentorMe) కి సహ వ్యవస్థాపకుడు, ఎండీగా ఉన్నారు. ఎస్ఐఆర్సీ నాయకత్వ బృందంలో ఆయనతో పాటు వైస్-చైర్మన్గా మునిశేఖర్ దారపనేని, కార్యదర్శిగా రాజేశ్ సాయి అయ్యర్, కోశాధికారిగా కె వి ఎన్ లావణ్య ఉన్నారు. నలుగురు ఆఫీస్ బేరర్లలో ముగ్గురు హైదరాబాద్కు చెందినవారు కావడం, దక్షిణ భారత ప్రాంతీయ మండలి చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.