డిచ్పల్లి, జూన్ 13: తెలంగాణ విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం మరోమారు తనిఖీలు నిర్వహించారు. కీలకమైన ఐదు సెక్షన్లలో ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు. వర్సిటీలో జరిగిన అక్రమాలపై పాలక మండలి సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6న విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. కీలకమైన రికార్డులు, హార్డ్‌డిస్క్‌లను స్వా ధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం మ రోమారు వర్సిటీకి వచ్చిన విజిలెన్స్ అధికారులు పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. ఏవో, ఎస్టాబ్లిష్మెంట్ కార్యాలయాలు, అకౌంట్ సెక్షన్, ఇం జనీరింగ్ విభాగాల్లో అధికారులు వివరాలు సేకరించారు. ఆయా విభాగాల హెడ్ల నుంచి జమా, ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీసీ తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు, వస్తువుల కొనుగోళ్లు ఫైళ్లను పరిశీలించారు.