హైదరాబాద్, డిసెంబర్29 (నమస్తే తెలంగాణ): పేద వెలమ విద్యార్థులకు 2024 విద్యా సంవత్సరానికిగానూ ‘విద్యా దాన నిధి’ పథకం ద్వారా స్కాలర్షిప్లు అందజేసినట్టు ‘విద్యా దాన నిధి’ సబ్ కమిటీ చైర్మన్ అయిల్నేని రవీందర్రావు, కన్వీనర్ పోల్సాని రవీందర్రావు తెలిపారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఇండియా వెలమ అసోసియేషన్ భవన్లో 537 మంది విద్యార్థులకు రూ.97లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఐవా అధ్యక్షుడు కృష్ణమనేని పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నీలగిరి దివాకర్‌రావు, తాండ్ర శ్రీనివాసరావు, మహిళా ఉపాధ్యక్షురాలు గోన శ్రీలత, ప్రధాన కార్యదర్శి కోట్ల వీణ, కోశాధికారి హరీశ్ చెప్యాల, కార్యవర్గ సభ్యులు కోట్ల నరేందర్‌రావు, ఉజ్జిని కిషన్‌రావు, చిట్నేని సంజీవరావు, చెన్నమనేని రామ్మోహన్రావు, అల్లాడి రాజేందర్రావు, గొట్టిముక్కల భాస్కరరావు, జీ కే ప్రవీణ్‌రావు, మహిళా కార్యవర్గ సభ్యురాళ్లు బొంత గోమతి, పడకంటి షర్మిల, ఐవా మాజీ ఉపాధ్యక్షులు సంకినేని జగన్మోహన్రావు, వేముల శ్రీకాంత్‌రావు, తానిపర్తి వేణుగోపాల్‌రావు, కల్వకుంట్ల ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.