హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎలాంటి అన్యాయానికి గురైనా దళితులు వెంటనే జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాలని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్సీఎస్సీ) ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ కవాడిగూడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్సీఎస్సీకి వచ్చిన 26 కేసులను విచారించి 22 కేసులను పరిషరించామని చెప్పారు. మహిళలపై లైంగికదాడి కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, 24గంటల్లో నివేదిక పంపాలని సూచించారు.