హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): డాక్టర్ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేండ్లపాటు డీన్ లేదా కనీసం పదేండ్ల పాటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసి, 67 ఏండ్ల లోపు వయసున్నవారు ఈ నెల 22 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.