హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియ ట్ విద్యామండలి, సాంకేతిక విద్యాకమిషనర్శాఖలోని పోస్టులకు ఎంపికైన లైబ్రేరియన్ అభ్యర్థులకు రెండోదఫా సర్టిఫికెట్ వెరిఫికేషన్ 31న ఉంటుందని టీజీపీఎస్సీ బుధవారం ప్రకటనలో తెలి పింది. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ ఆఫీసులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. ఆ రోజు రాలేని అభ్యర్థులు సెప్టెంబర్ 2న హాజరుకావొచ్చని తెలిపింది. అభ్యర్థుల తుదిజాబితాను, సర్టిఫికెట్ల వివరాలను వెబ్సైట్ https://www. tspsc. gov.in లో పొందుపర్చినట్టు వెల్లడించింది.
ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ బుధవారం ప్రకటన విడుదల చే శారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు హాస్టళ్లలో, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీడీడీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో, ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, సంగారెడ్డిల్లోని ఎంపీపీటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో తనిఖీలు చేశారు. వంట గదిలో పారిశుధ్యం, ఆహారం వండుతున్న తీరును పరిశీలించారు.
తెలుగు రాష్ర్టాల్లో ఏడబ్ల్యూఈస్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టా ల్లో మహిళా సాధికారత కోసం సమష్టిగా పనిచేయడం సంతోషంగా భావిస్తున్నామని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ ఫర్ కమర్షిలైజేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ రిసెర్చ్ భాగస్వామంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం అకాడమీ(ఏడబ్ల్యూఈ)లు ఏర్పాటుచేయనున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 60 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాలు, వనరులు కల్పించడంతోపాటు వారి సాధికారతే లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.