హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లాంటి గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. 8039కిపైగా పోస్టులు ఉండటంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. పోస్టుల భర్తీకి 1 డిసెంబర్ 2022న నోటిఫికేషన్ విడుదల కాగా, 1 జూలై 2023న రాత పరీక్ష నిర్వహించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత గ్రూప్-4 తుది ఫలితాలు విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.