హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఈనెల 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ వేదికగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని పేరొన్నారు.
డ్రైవర్ పో స్టులకు దరఖాస్తు చేసుకున్న 28,903 మంది అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డ్రైవింగ్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రామిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 25,998మంది అభ్యర్థులకు వెయిటేజీ మారుల కేటాయింపు, ధ్రువపత్రాల పరిశీలన మాత్రమే నిర్వహించనున్నట్టు తెలిపారు. అడ్మిట్ కార్డులను 13 నుంచి 22 వరకు వెబ్సైట్ www.tgprb.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.