హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు 1:2 మెరిట్ జాబితాను రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ నియామక బోర్డు (ట్రిబ్) గురువారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు ట్రిబ్ అధికారులు పేర్కొన్నారు. నిరుడు ఆగస్టు నెలలో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.