హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొకిసలాట కేసులో ముందస్తు బెయిల్ కోసం నటుడు అల్లు అర్జున్ మేనేజర్ ఏ శరత్చంద్ర, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు కృష్ణ, శ్రీరాములు దాఖలు పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ కే సుజన ప్రకటించారు. ‘పుష్ప-2’ సినిమా ప్రీమియ ర్ షో సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత మరణించడంతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఈ ఘటనపై చికడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.