హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఫిజిక్స్ ప్రొఫెసర్‌ను నియమించి ఆశ్చర్యపరిచింది. కాకతీయ వర్సిటీకి చెందిన ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డిని ఎడ్‌సెట్ కన్వీనర్‌గా నియమించింది. ఇలా నియమించడం అరుదుగా చెప్పవచ్చు. ఈ సారి ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న కాకతీయ వర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఫి జిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌ను ఎడ్‌సెట్ క న్వీనర్‌గా నియమించడాన్ని ఎన్సీటీఈ స భ్యుడు ప్రొఫెసర్ పారిపల్లి శంకర్ తప్పుపట్టారు. ఈ విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి స్పందిస్తూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో, అన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.