వేములవాడ : ఈ నెల 25వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా సుప్రభాతసేవ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారేశ్వరాలయాలను కూడా మూసివేయబడుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.35 గంటల తర్వాత గ్రహణానంతరం పుణ్యాహవచనంతో పాటు సంప్రోక్షణ చేసి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, అనంతరం భక్తుల దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
కార్తీకమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 26నుంచి ప్రారంభమవుతున్న కార్తీకమాసంలో రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయం ఎదుట కార్తీక దీపాలు వెలిగించుకునే భక్తుల కోసం చెట్టు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.