వేములవాడ, జనవరి 25 : సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన వైద్యురాలు ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న-విజయ రెండో కూతురు లిఖిత ఎంబీబీఎస్ హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాలలో పూర్తిచేశారు.
పీజీలో ఎండీ కూడా గాంధీలోనే పూర్తి చేసి, గోల్డ్ మెడల్ సాధించారు. ఊపిరితిత్తుల విభాగంలో వైద్య సేవలు అందించాలని నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షకు హాజరైంది. శనివారం విడుదలైన ఫలితాలలో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించగా వైద్యురాలిని పలువురు అభినందించారు.
హైదరాబాద్, జనవరి 25( నమ స్తే తెలంగాణ) : తె లుగు రాష్ట్రాల్లో 125 కేసుల్లో నిందితుడైన కరుడుగట్టిన నేరస్థుడు ప్రభాకర్‌ను ప్రాణాలకు తెగించి పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వ గ్యాలంటరీ అవార్డు దకింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో కాలికి తూటా తగిలి రక్తమోడుతున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. నానక్‌రామ్‌గూడకు చెందిన ప్రభాకర్(30) 2022లో విశాఖ సెంట్రల్ జైలు ఎసార్ట్ నుంచి తప్పించుకొని అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. గౌలిదొడ్డిలోని ‘ప్రిజం పబ్’కు ప్రభాకర్ వస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి పకా సమాచారం రాగానే అప్రమత్తమైన తన సహచర సిబ్బంది ప్రదీప్‌రెడ్డి, వీరస్వామి కలిసి పబ్ వద్ద పట్టుకున్నారు.