హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవుకానీ, మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడివని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. రూ.25 వేల కోట్లతో పూర్తయ్యే మూ సీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు అని చెప్పి, రూ.1.25 లక్షల కోట్లు దోచుకోవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు.
సీ ఎంగా ఎంతకాలం ఉంటాడో తెలియనందు న దీపం ఉన్నప్పుడే ఇల్లు చకబెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి ధనదాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మూసీ పేరుతో దోపిడీ కుట్ర ను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావును బుల్డోజర్లతో తొక్కించి చంపుతామన్నట్టుగా రేవంత్ బరితెగించి మా ట్లాడుతున్నారని ఫైరయ్యారు. వానకాలం పంటకు రైతుభరోసా ఇవ్వలేమని రేవంత్ మాటగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించి రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. మరోవైపు అన్ని పంటలకు బోనస్ ఇ స్తామన్న హామీ సైతం అటకెక్కించారని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నేత లు దూదిమెట్ల బాలరాజుయాదవ్, పల్లె రవికుమార్, రాజారాంయాదవ్తో కలిసి ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను సీఎం అవుతానని రేవంతే అనుకోలేదని, అందుకే ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇ చ్చారని, వాటిని నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఇక కాంగ్రెస్ జన్మ లో రాష్ట్రంలో బతికి బట్టగట్టే పరిస్థితి లేదని చెప్పారు.
పదవి కాపాడుకోవడానికి దోపిడీ చేస్తూ ఢిల్లీకి డబ్బులు పంపుతున్నారని విమర్శించారు. రూ.25 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ పునరుజ్జీవం కోసం రేవంత్ లక్షన్నర కోట్లు వెచ్చిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. ఇవన్నీ అడిగితే కేటీఆర్, హరీశ్‌రావులపై రాజీవ్ సద్భావన సభలో రేవంత్‌రెడ్డి సంసారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు. నా డు రాజీవ్‌గాంధీ భాయి.. భాయి అంటే నేడు రేవంత్ భౌ భౌ అని అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ పనులకు అడ్డుపడితే కాం గ్రెస్ నేతలతో బుల్డోజర్లు నడిపించి కేటీఆర్, హరీశ్‌రావులను చంపుతా అని రేవంత్ అం టున్నారని, ఇది సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాషేనా? అని నిలదీశారు. తక్షణ మే సీఎం రేవంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్
నమ్మి అధికారం అప్పగిస్తే రైతులను కాంగ్రె స్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు భరోసా ఎగ్గొట్టినందుకు ఆదివారం బీఆర్ఎస్ అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపు ఇచ్చిందని గుర్తుచేశారు. రైతులు రేపటి దాకా ఆగడం లేద ని, ఈ రోజే అనేక చోట్ల ధర్నాలు మొదలు పెట్టారని చెప్పారు.
వచ్చే డిసెంబర్ 9న సోని యా పుట్టిన రోజు సందర్భంగా మొత్తం రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి తుమ్మ ల మళ్లీ మాట మార్చారని, కేవలం రూ.2, 500 కోట్లే వేస్తామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలను ఇప్పటి కీ చాలా ప్రాంతాల్లో తెరువలేదని విమర్శించారు. రైస్‌మిల్లుల అలాట్మెంట్ పూర్తి కాలేదని తెలిపారు. అన్ని రకాల వడ్లను బోనస్‌తో క్వింటాల్‌కు రూ.2,800 చెల్లించి కొనాలని డిమాండ్ చేశారు. మక్కలు, సోయాబీన్ రైతులకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంత్రుల ఫామ్‌హౌస్‌లపై చర్య తీసుకో..
నాయకుల ఫామ్‌హౌస్‌లు మూసీ బఫర్ జోన్లో ఉన్నాయా? లేవా? అని తేల్చాడానికి సీఎం పదవిలో ఉంటూ నిజనిర్ధారణ కమిటీ వే స్తా అంటున్నారని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజనిర్ధారణ కమిటీలు పౌర సమాజం వేస్తుందని, సీఎం కాదని తెలిపారు. చట్టప్రకారం ఫామ్‌హౌస్‌లపై చర్యలు తీసుకుంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. ముందు చె రువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మంత్రులు, కాంగ్రెస్ నాయకుల ఫామ్‌హౌస్‌లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘మీ సోదరుడి ఇంటి కూల్చివేతకు నోటీసులిస్తవ్.. పేద ల ఇండ్ల మీదికి మాత్రం నేరుగా బుల్డోజర్లను పంపుతవ్. ఇదేం నీతి రేవంత్‌రెడ్డి?’ అని ప్రశ్నించారు. బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని, రూ.1.25 లక్షల కోట్లు దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతు రుణమాఫీ అయ్యేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా వదలిపెట్టబోదని తేల్చి చెప్పారు.
వెనుక చేతులు కట్టుకొని నిలబడ్దదెవరో చూడు!
హరీశ్‌రావు తన ఇంటికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారని రేవంత్‌రెడ్డి పిచ్చి ప్రే లాపనలు చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీశ్‌రావు పదేం డ్లు మంత్రిగా ఉన్నపుడు రేవంత్ ఎకడ ఉన్నారు? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు వెనకాల ఓ కార్యకర్తగా ఉన్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. హరీశ్‌రావు ఎవరి చెప్పులో మోశారు అంటున్న రేవంత్..
యనమల చెప్పులు తాకుతున్న ఫొటోను లోకమంతా చూసిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా ప్రశాంత్‌రెడ్డి మీడియాకు చూపించారు. తన కన్నా హరీశ్‌రావు ఎంతో సీనియర్ అని రేవంత్ గ్రహించాలని హితవుపలికారు. ‘ఈ అసహనం మాటలు ఎందుకు? పాలించ డం చేతకాకపోతే రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్ర జలకు క్షమాపణ చెప్పి సీఎం పదవి నుంచి తప్పుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
బండి సంజయ్.. రేవంత్ కుమ్మక్కు
కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మకయ్యారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎంని బండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ పదవి పోతుందని సంజయ్ తెగ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులే రేవంత్‌ను దించుతారని, జాగ్రత్తగా ఉండాలని సంజయ్ సలహా ఇవ్వ డం ఏమిటని ప్రశ్నించారు. గ్రూప్-1 అ భ్యర్థుల విషయంలో బీఆర్ఎస్కు క్రెడిట్ దక్కుతుందని బండి సంజయ్ పెద్ద డ్రా మాకు తెరలేపారని విమర్శించారు. ఆందోళనకు సంజయ్ మద్దతు ఇవ్వడం రేవం త్ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఎన్నికల హామీ ల అమలుపై ఎందుకు సీఎంను నిలదీయడం లేదని ప్రశ్నించారు.