గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 04, 2020 , 01:44:18

అంతరిక్షంలో అపార అవకాశాలు

అంతరిక్షంలో అపార అవకాశాలు
  • వైమానిక, అంతరిక్షరంగాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి
  • నల్సార్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వక్తలు

శామీర్‌పేట: వైమానిక, అంతరిక్షరంగాలపై పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటే అవకాశాలు అపారంగా ఉన్నాయని వక్తలు పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని నల్సార్‌లో ‘భవిష్యత్‌ రవాణా’ అనే అంశంపై రిజిస్ట్రార్‌ బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన రెండు రోజుల న్యాయ సదస్సు జరిగింది. ఇందులో అంతరిక్షం, వైమానిక రంగాల్లో న్యాయపరమైన అంశా లు, చట్టాలు, పాలసీలపై విస్తృతంగా చర్చించారు. ఐసీఏవో కన్సల్టెర్‌ పీసీకే రవీంద్రన్‌ మాట్లాడుతూ.. వైమానిక, అంతరిక్ష, రక్షణరంగాల్లో పరిశోధన, అధ్యయనాలు భవిష్యత్‌తరాలకు అత్యావశ్యకమన్నారు. బోయింగ్‌ వైమానిక సంస్థ న్యాయవాది అఖిల్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనేక వైమానిక సంస్థలు రాబోతున్నాయని, న్యాయవాదులు ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీబీఎస్‌ రాజు ముఖ్యఅతిథిగా, కేరళ హైకోర్టు న్యాయమూర్తి ముస్తాక్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.


logo