ఆ.వె: కష్టములు దెలిసిన ఘనుడైన కేసిఆర్
పేద గర్భిణిలకు బాధ తీర్చ
అమ్మ యొడి యనెడి యొక అపూర్వ పథకము
నమలు జేసె ప్రజకు నండ నుండ!
సీ: రెండ్వేల పదహారు నుండి మొదలిడెను
నలుబదియొక వాహనముల తోడ
ప్రారంభమును జేసె పల్లెప్రజ కొఱకు
రెండు వందలు మలి విడుతలోన
వాహనమ్ములగూర్చె వనితల మేలుకై
వందనాలుగు సంఖ్య వత్తగానె
పది సీట్లను గలిగి పడుకొను వీలున్న
వాహనంబు వడిగ వచ్చుదరికి!
ఆ.వె: ఆపదేమి లేక అమ్మవొడియనుచు
ఆసుపత్రిలోన కాన్పు జరుగు
తల్లి బిడ్డలకును దగురీతి వైద్యము
సరియగు సమయాన జరిగి తీరు!
ఆ.వె: ప్రజలకండ నుండు పథకాలనెన్నియో
అమలు జేసెనెన్నొ నార్తి బాప
ముఖ్యమంత్రి గారు మూర్తిత్రయము సాటి
వసుధ లోన మనకు వన్నె తెచ్చె!
-బొమ్ము విమల
99897 75161