ఖైరతాబాద్, ఆగస్టు 8 : ఇది నిర్మాణ రంగంలోనే ఓ నూతన విప్లవం. వాసవిగ్రూప్, వాసవి భువి పేరుతో చేపట్టిన కొత్త ప్రాజెక్టు సొంతింటి కల నెరవేర్చుకునే వారికి ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. హైదరాబాద్‌లోని కొంపల్లిలో సుమారు 10.65 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. 1994లో హైదరాబాద్‌లో వాసవిగ్రూప్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వాసవి గ్రూప్ అధినేత విజయ్ కుమార్ యర్రం దూరదృష్టితో అన్ని వర్గాల ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన సొంతింటికలను నెరవేరుస్తూ తనదైన రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ముద్రవేసుకున్నారు. 30 ఏండ్ల ప్రస్తానంలో 30 రెసిడెన్షియల్, 17 కమర్షియల్ ప్రాజెక్టులను చేపట్టి నగరాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం వహిస్తున్నారు.
కొంపల్లిలో చేపట్టిన వాసవి భువి ప్రాజెక్టు హైదరాబాద్‌లోని ప్రధానమైన మార్గాలకు కనెక్టివిటీ కలిగి ఉంది. పచ్చదనం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పర్చుకోవాలనుకునే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యాసంస్థలు, వైద్యశాలలు, షాపింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్ హబ్ ఇలా అన్ని అందుబాటులో ఉన్నాయి.
వాసవి భువి ద్వారా సొంతింటి కల నెరవేర్చుకునే వారికి ప్రత్యేకమైన గేటెడ్ కమ్యూనిటీ అనుభవాన్ని అందిస్తుంది. భద్రత, గోప్యత, సురక్షితమైన అనుభవం కలిగిస్తుంది. ప్రధానంగా వాసవి భువిలో ఇంటిని సొంతం చేసుకున్న వారికి ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతిస్తుంది. పచ్చదనం, పరిశుభ్రత, నియంత్రిత యాక్సెస్ పాయింట్లు, 24/7 సెక్యూరిటీతో యజమానులకు అభద్రతా భావాన్ని దూరం చేసి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.
వాసవి భువి నిర్మాణం ఓ అద్భుతమైన కళాఖండాన్ని తలపిస్తుంది. ఇందులో ఎనిమిది ఆకట్టుకునే టవర్లు, ఒక్కొక్కటి 17 అంతస్తులతో ప్రీమియం 2బీహెచ్‌కే, 2.5బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అపార్టుమెంట్లను నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ గృహాల సముదాయం వివిధ రకాల జీవనశైలీల అవసరాలను తీరుస్తాయి. 65 శాతం ఖాళీ స్థలంతో విశాలమైన నిర్మాణాలతో గృహ యజమానులకు సేచ్ఛ, ప్రశాంతతను అందిస్తుంది. ప్రతి నిర్మాణంలో అద్భుతమైన పీచర్స్ ఉన్నాయి.
వాసవి భువి నిర్మాణాలు నివాసితులకు విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది. సహజమైన వెలుతురు, కావాల్సినంత ఖాళీ స్థలంతో 1,330 నుంచి 1505 స్కేర్ఫీట్లలో 2, 2.5 బీహెచ్‌కే, 1,600 నుంచి 2,385 చదరపుఅడుగుల్లో 3 బీహెచ్‌కే అపార్టుమెంట్లు అందుబాటులో ఉన్నాయి.
వాసవి భువి 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన క్లబ్‌హౌజ్ ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. నివాసితులు ఆరోగ్యకరమైన జీవశైలికి, శారీరక, మానిసిక ఆరోగ్యానికి ఈ క్లబ్ హౌజ్ చక్కటి వేదికగా నిలుస్తుంది. ఆధునిక జిమ్, స్విమ్మింగ్ పూల్స్, ధ్యానం, యోగా చేసుకునేందుకు ఆహ్లాదకరమైన, శాంతియుత వాతావరణం, స్కాష్, టెన్నీ కోర్టులు ఈ క్లబ్ హౌజ్ ప్రత్యేకతలు. అంతేకాకుండా సమావేశపు గదులు, కమ్యూనిటీ ప్రజలు శుభకార్యాలు, పండుగలు, పబ్బాలకు చేసుకునేందుకు మంచి వేదికగా నిలుస్తుంది.
వాసవి భువి నివాసితుల సామాజిక సామూహాన్ని ప్రోత్సహిస్తున్నది. సామాజిక, వినోద భరితమైన కార్యక్రమాలతో సమాజ జీవనం మెరుగుపరుస్తుంది. నివాసితులు పొరుగువారితో సన్నిహితమైన, సమ్మిళిత వాతావరణంలో జీవించే వీలు కల్పిస్తుంది. నిత్యం సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు, వర్క్‌షాప్స్ నిర్వహించడం, సమావేశాలు ఏర్పాటు చేసి మనుషుల మధ్య దూరాలను తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో పిల్లల ఆట స్థలాలు, వాకింగ్ పాత్స్ లాంటి వాటితో సరదాగా, సంతోషంగా గడిపే వీలు కల్పిస్తుంది.
వాసవి భువి నివాసితులు మానసిక ప్రశాంతతో జీవించే వీలు కల్పిస్తుంది. భద్రతకు పెద్ద పీటవేస్తూ కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్, 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణ, విశాలమైన పార్కింగ్ స్థలం, రెప్పపాటులో కూడా విద్యుత్‌కు ఆటంకం కలుగకుండా పవర్ సైఫ్లై, చెత్త, వ్యర్థాలను తరలించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి సదుపాయాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో వాసవి గ్రూప్ అగ్రశ్రేణి నిర్మాణరంగ సంస్థగా విరాజిల్లుతున్నది. విభిన్నమైన అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అసాధారణమైన నివాస, వాణిజ్య ప్రాజెక్టులను అందిస్తోంది. నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా వినియోగదారుల మెప్పుపొందుతూ నిబద్ధతమైన నిర్మాణాలకు మారుపేరుగా వాసవి గ్రూప్ అద్భుతమైన ఖ్యాతిని ఆర్జించింది. ఆధునిక జీవనశైలి, విలాసవంతమైన జీవన విధానం కోసం వాసవి గ్రూప్ కృషి చేస్తోంది.