న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పవిత్ర గంగానదీ పుష్కరాల సందర్భంగా ఈ నెల 29న వారణాసిలో కాశీ తెలుగు సంగమం కార్యక్రమం జరగనుంది. కాశీలోని తెలుగువారి ఆశ్రమాలు, ధర్మశాలలో కూడిన శ్రీ కాశీ తెలుగు సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 29న మానసరోవర్ ఘాట్ వద్ద జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించనున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలతో కాశీకి ఉన్న చారిత్రక సంబంధాల గురించి ఆయన మాట్లాడనున్నట్టు తెలుస్తున్నది.