హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): శ్రావణమాసం శుక్రవారం కావడంతో అమ్మవారు వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి, విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయాల్లో వ్రతాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకాలు నిర్వహించారు. దుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 8న ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.