హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : వాహనాల నమోదుకు సంబంధించి శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్నదని ఆర్టీఏ ఉన్నతాధికారులు తెలిపారు. గురువారం ప్రకటన విడుదల చేశారు.
పౌరులు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్)లను ‘NextGen mParivahan’ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.