హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మున్నూరు కాపు సహకార సంఘానికి తోడ్పాటును అందించాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్కు విజ్ఞప్తి చేశారు.
మున్నూరుకాపు అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావుతో కలిసి ఢిల్లీ ఉద్యోగ్ భవన్లో గురువారం కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మున్నూరుకాపు సంఘం నేతలు అరుణ, రవీందర్, శ్రీనివాస్, సతీశ్, సంపత్, మహేందర్, బాలరాజ్ తదితరులు మంత్రిని కలిసి తమ సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎంపీ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
.