మంగపేట, సెప్టెంబర్1: ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన వాసం వివేక్ జమ్మూకశ్మీర్ లడఖ్‌లోని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను అధిరోహించి జాతీయ స్థాయిలో పేరు సాధించాడు. వివేక్ ఆగస్టు 24న లడఖ్‌లో 20,600 అడుగుల ఎత్తులో ఉన్న కంగ్యాత్సే-2 శిఖరాన్ని అధిరోహించాడు. తర్వాత మూడో రోజునే ఆగస్టు 27న (21 వేల అడుగుల ఎత్తులోని కంగ్యాత్సే-1 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఇవేగాక ఇంకా చాలా పర్వతాలను వివేక్ అధిరోహించాడు.