హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వివిధ దవాఖానలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకుగానూ త్వరలోనే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 531 భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్బీ), 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్, వివిధ దవాఖానల్లో 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.