హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సర్దుబాటుకు ముందే బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని యూఎస్పీసీ, ఎస్జీటీయూ పిలుపునిచ్చాయి. మరోవైపు జీవో 25లోని నిబంధనలు సవరించాలని కోరుతూ గురువారం యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కే జంగయ్య, పీ నాగిరెడ్డి పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కలిసి వినతిపత్రాలు అందజేయగా, ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, వెంకటేశం సైతం వినతిపత్రం సమర్పించారు.