హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వీసా అపాయింట్మెంట్లను హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ రీషెడ్యూల్ చేసింది. మంగళవారం క్రిస్మస్ సెలవు కావడంతో నేటి అపాయింట్మెంట్లను జనవరి 15కు రీషెడ్యూల్ చేస్తున్నట్టు సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. దరఖాస్తుదారులకు సమాచారాన్ని మెయిల్ చేయనున్నట్టు పేర్కొంది.
అన్ని వీసా ఇంటర్వ్యూలు జనవరి 15కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.