UPSC | హైదరాబాద్ : యూపీఎస్సీకి సంబంధించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 2,736 మంది అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. వీరంతా పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 150 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక కాగా, ఇందులో తెలంగాణకు చెందిన వారు 43 మంది అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్ పరీక్షలను ఆగస్టు 22 నుంచి 31 వరకు నిర్వహించారు.