Dussehra Scheme | కమలాపూర్/పొతంగల్, అక్టోబర్ 1: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో కొందరు యువకులు దసరా పండుగ పురస్కరించుకుని వినూత్న స్కీం పెట్టారు. డ్రాలో గెలిచిన వారికి రూ.100కే మొదటి బహుమతిగా మేకపోతు, రెండో బహుమతిగా గొర్రె పొట్టేలు, మూడో బహుమతిగా జానీవాకర్ ఫుల్‌బాటిల్, నాలు గో బహుమతిగా టీచర్స్ ఫుల్‌బాటిల్, ఐదో బహుమతిగా బ్లాక్‌డాగ్ ఫుల్‌బాటిల్, ఆరో బహుమతిగా సిగ్నేచర్ ఫుల్‌బాటిల్, 7, 8 బ హుమతుల కింద నాటుకోడి పుంజులు, 9, 10 బహుమతులుగా నాటుకోడి పెట్టలు ఇవ్వబడును అని రాశారు.
రూ.100 చెల్లించి కూపన్ తీసుకోవాలని కోరారు. కొందరు యువకులు నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచర్లలో ‘వంద కొట్టు.. మేక పట్టు’ అంటూ గ్రామస్థులను ఆకర్షిస్తున్నారు. ఇలా అందరి దగ్గర రూ.100 తీసుకుని, 10న లక్కీడ్రా నిర్వహించనున్నారు.