హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసొసియేషన్ ఆఫ్ డెన్మార్క్ అధ్యక్షుడిగా ఉపేందర్‌గౌడ్ ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన ఉపేందర్‌గౌడ్ డెన్మార్క్‌లో స్థిరపడ్డారు. ఉపేందర్ తండ్రి జీడయ్య రిటైర్డ్ హెడ్మాస్టర్. బీసీఏ చదివిన తర్వాత డెన్మార్క్‌లో మాస్టర్స్ పూర్తిచేసిన ఉపేందర్ అక్కడే స్థిరపడ్డారు.
తెలంగాణ ప్రొఫెషన్స్‌ను ఏకం చేసి సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సురేందర్, కార్యదర్శిగా విజయ్మోహన్గోపి, కోశాధికారిగా ఈశ్వర్, టెక్నికల్ మేనేజర్‌గా పవన్‌కుమార్, ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మేనేజర్‌గా సతీశ్, కార్యవర్గ సభ్యులుగా రాజ్‌కుమార్, రమేశ్‌ను ఎన్నుకున్నారు.