హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ముగ్గురు సభ్యులను నియమించారని ‘తెలంగాణ యూ నియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్’ (టీయూడబ్ల్యూజే) ఆరోపించింది. ఈ మే రకు సోమవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధులు కమిషనర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తాను కొనసాగుతు న్న యూనియన్‌కు సంబంధించిన అనుబంధ సంఘాలకు చెందిన ముగ్గురు స భ్యులను స్వయంగా నామినేట్ చేయడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా వారిని నామినేషన్ చేశారని, గత సమావేశంలో చట్టవిరుద్ధంగా కూర్చోవడానికి వారిని అనుమతించారని ఫిర్యాదు చేశారు. జీవో-252 ప్రకారం వీడియో జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు, చిన్న పత్రికల నుంచి ముగ్గురు సభ్యులను నెల క్రితమే అధికారికంగా ఎంపిక చేసి ప్రకటించారని, అదే కోటా కింద మరో ముగ్గురు సభ్యులను తాజాగా నామినేట్ చేయడం, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి యోగానందం, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి నవీన్‌కుమార్ యారా, ఏజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాసర్ తదితరులు ఉన్నారు.