చేగుంట, జనవరి 30 : మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతం లో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏండ్ల చిరుత మృత్యువాతపడింది. వల్లూర్ అటవీ ప్రాంతం నుంచి మగ చిరుత నడుచుకుంటూ వెళ్తున్నది. చేగుంట వైపు నుంచి నార్సింగి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో చిరుత తీవ్ర గాయపడి మృత్యువాతపడింది. అధికారులు చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం వల్లూ ర్ ఫారెస్టులోని గెస్ట్హస్కు తరలించారు.