హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : గీతం డీమ్డ్ వర్సిటీలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష (గాట్23)కు www.gat.gitam.edu వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ వీసీ డీఎస్ రావు సూచించారు.
ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు దేశవ్యాప్తంగా 48 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి గీతం వర్సిటీలో లిబరల్ ఆర్ట్స్ కోర్సులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.