వర్సిటీ రిక్రూట్మెంట్పై పీటముడి.. ఆర్థికశాఖ ఆమోదం లభించని వైనం
ఉస్మానియాను స్టాన్ఫోర్డ్.. ఆక్స్పోర్డ్ వర్సిటీల స్థాయిలో డెవలప్ చేస్తాం.. అన్ని వర్సిటీలను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ఏ వర్సిటీలో ఎన్ని పోస్టులు భర్తీచేయాలన్న అంశంపై స్పష్టత ఇవ్వడంలేదు. పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపడంలేదు. వర్సిటీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖలో మూలుగుతున్నది.
- రేవంత్ సర్కార్ వద్దే ఫైల్ పెండింగ్
- నివేదిక కోరిన రాష్ట్ర గవర్నర్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియాను స్టాన్ఫోర్డ్.. ఆక్స్పోర్డ్ వర్సిటీల స్థాయిలో డెవలప్ చేస్తాం.. అన్ని వర్సిటీలను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ఏ వర్సిటీలో ఎన్ని పోస్టులు భర్తీచేయాలన్న అంశంపై స్పష్టత ఇవ్వడంలేదు. పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపడంలేదు. వర్సిటీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖలో మూలుగుతున్నది. సర్కార్ జీవో ఇస్తుందని.. రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభిద్దామని వీసీలు కండ్లు కాసేలా ఎదురుచూస్తున్నారు. నెలలు గడిచినా ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.
భర్తీచేసేది 420కిపైగా పోస్టులే
వర్సిటీల్లో 2,125 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్స్ పెరుగుతుండటంతో సర్కార్ ఆచార్యుల ఉద్యోగ విరమణ వయస్సును 60-65 ఏండ్లకు పెంచింది. నియామకాలు చేపట్టాల్సిన సర్కార్ ఉన్నవాళ్లను కొనసాగించడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీల్లో 420కి పైగా పోస్టుల భర్తీ కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించింది. భారీగా ఖాళీలున్నా.. పలు విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు లేకుండా నడిపిస్తున్నారు. వర్సిటీల్లో పరిస్థితు లు దిగజారుతుండటంతో గవర్నర్ శివప్రతా ప్ శుక్లా జోక్యం చేసుకున్నారు. ఇటీవలే ఉ న్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని లోక్‌భవన్‌కు పిలిపించుకుని ఆరా తీశారు. నివేదిక సమర్పించాలని ఆదేశించా రు. త్వరలోనే వర్సిటీలవారీగా వీసీలను పిలిచి సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
74% టీచింగ్ పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలోని మొత్తం 11 వర్సిటీల్లో 74 % టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2,878 పోస్టులుంటే ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

