కాశీబుగ్గ, డిసెంబర్13: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వజ్రోత్సవ వేడుకల్లో రైతులు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని నిలదీశారు. రుణమాఫీ వంద శాతం అయినట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకుంటే రైతులంతా ఏకమై ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వెంటనే స్పందించిన కోదండరెడ్డి తొందర పడొద్దని, టెక్నికల్ ప్రాబ్లమ్‌తో రుణమాఫీ నిలిచిపోయిందన్నారు. తొందర్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.