భూదాన్‌పోచంపల్లి, జూన్ 13 : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమ నేత, దివంగత ఆచార్య కొండా లక్ష్మ ణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘యూనిటీ.. ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ చిత్రం పగెంట్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులో ఉత్తమ డాక్యుమెంటరీ-2024గా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 400కు పైగా చిత్రాలు రాగా, 38 చిత్రాలను అవా ర్డు క్యాటగిరీలో ఎంపిక చేసినట్టు ఈ డ్యాకుమెంటరీ నిర్మాత చిరందాస్ ధనంజయ తెలిపారు. జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు కొల్కతలోని స్టార్ థియేటర్ హాల్లో ఎంపికైన చి త్రాల ప్రదర్శన, అవార్డుల అందజేత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీకి భూదాన్ పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వం వహించారు.