హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులు చేసే ఫిర్యాదుల పరిష్కారంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. రైళ్లలో ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలు, భద్రత వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సమన్వయం తో నేరాలను తగ్గించే వ్యూహాలు, మెరుగైన రైల్వే భద్రత కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జోనల్ మేనేజర్లతో చర్చించారు. రానున్న రోజుల్లో రైల్వే భద్రత అంశాలపై కీలకంగా వ్యవహరించాలని ఆర్పీఎఫ్ అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు జీఆర్పీ ఉన్నతాధికారుల 5వ అఖిల భారత సమావేశంలో ఈ అంశాలపైనా చర్చించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.