Kishan Reddy | ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ నిజస్వరూపాన్ని తెలియజేయాలి.. కిషన్ రెడ్డి పిలుపు
Kishan Reddy | ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
Kishan Reddy | ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని తెలిపారు. మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌తో నెహ్రూ రాజీనామా చేయించారని పేర్కొన్నారు.
1954 నుంచి 88 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ సహా 21 మందికి కాంగ్రెస్ భారతరత్న ఇచ్చిందని.. కానీ అంబేడ్కర్‌ను ఎందుకు విసర్మించిందో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేడ్కర్ ఫొటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
అంబేడ్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయీ అని.. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం వాజ్‌పేయీ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ambedkar
- BJP
- Congress
- Kishan Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

