Kishan Reddy | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డైరీ ఆవిషరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలోని వ్యాపారవేత్తలను దావోస్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అంబేద్కర్, కర్పూరీ ఠాకూర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, జయప్రకాశ్‌నారాయణ్, మహాత్మాగాంధీ స్ఫూర్తితో బీజేపీ పని చేస్తున్నదని తెలిపారు. అంబేదర్ను ఎన్నికల్లో ఓడించి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రభుత్వాలను కూల్చివేసి, పత్రికా స్వేచ్ఛను హరించివేసిందని మండిపడ్డారు. రాజ్యాంగం గురించి అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హకు లేదని పేర్కొన్నారు.