హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నవభారత నిర్మాణానికి అంకుర సంస్థ లు (స్టార్టప్స్) వెన్నెముకలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రదాన్ అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డీప్‌టెక్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. డిఫెన్స్ టెక్, స్పేస్‌టెక్, ఐవోటీ, రోబోటిక్స్, ఏఐ, ఆటోమేష న్ స్టార్టప్‌లు మరింత రాణించాల్సిన అవసరమున్నదని, ఆ దిశగా విద్యార్థులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కంది ఐఐటీహెచ్‌లో ‘ఇన్వెంటివ్-2024’ రెం డో ఎడిషన్‌ను ప్రారంభించారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, ఐఐటీహెచ్ చైర్మన్ డాక్టర్ బీవీ మోహన్‌రెడ్డి, డైరెక్టర్ బీఎస్ మూర్తి తదితరులతో కలిసి ఆర్అండ్డీ ప్రదర్శనను ప్రారంభించారు. ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ.. దేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తున్నదని, 2014 నాటికి కేవలం 350గా ఉన్న స్టార్టప్ కంపెనీల సంఖ్య ఇప్పుడు 1.2 లక్షలకు చేరిందని తెలిపారు. ఐఐటీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.1,000 కోట్లతో సమ్మక్క సారక్క ట్రైబల్ వర్సిటీని ఏర్పా టు చేసి.. ఆన్లైన్, డిజిటల్, డిస్టెన్స్ కోర్సుల ని ర్వహణపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. అనంతరం ఐఐటీహెచ్‌లో నెలకొల్పిన డాక్టర్ బీవీఆర్ మో హన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మంత్రి ప్రారంభించారు.