కేసీఆర్ కట్టిన భవనంలోనే పసుపుబోర్డు కార్యాలయం
కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నా యకులు నానా యాగి చేస్తున్నారు. ప్రజాపాలన, సంక్షేమాన్ని మరిచి గులాబీ బాస్ కేంద్రంగా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.
- నేడు ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా
- జాతీయ బోర్డు స్థాపనలో ముందుచూపు లేని కేంద్రం
- ఆహ్వాన పత్రికల్లో కనిపించని ఇన్చార్జి మంత్రి పేరు
నిజామాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నా యకులు నానా యాగి చేస్తున్నారు. ప్రజాపాలన, సంక్షేమాన్ని మరిచి గులాబీ బాస్ కేంద్రంగా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నిత్యం కేసీఆర్ నామ జపం చేయనిదే ఆ రెండు పార్టీల నాయకులకు పొద్దుగడువదు. పదేండ్లపాటు కేసీఆర్ పాలనను తిట్టిపోసిన బీజేపీ పెద్దలకు.. కేసీఆర్ కట్టించిన భవనమే ఇప్పుడు దిక్కయింది. కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచిన బిల్డింగే ఇప్పుడు జాతీయ పసుపుబోర్డు ఆఫీస్కు అక్కరకు వస్తుంది. కేసీఆర్ పాలనలో నిర్మించిన ఆ భవనంలోకి కేంద్ర హోంమంత్రి అమిత్షా అడుగు పెడుతుండటం ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ప్రొటోకాల్ ఉల్లంఘన..
పసుపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, అమిత్ షా ఫొటోలు ఉంచారు. ముఖ్యఅతిథిగా అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్రెడ్డి, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్లను ముద్రించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు అందులో లేవు. ప్రభుత్వ సలహాదారులకు కూడా చోటుఇవ్వలేదు. జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన వ్యక్తులతో ఒకరోజు ముందు సాదాసీదాగా కార్డులను పంపించారు. ఆహ్వాన పత్రికలో జిల్లాకు చెందిన నేతలందరి పేర్లు పెట్టాల్సి వస్తుందనే కారణంతోనే ఎంపీ అర్వింద్ తెలివిగా తన పేరు లేకుండా చూసుకున్నట్టు పలు పార్టీల నేతలు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

