Telangana | మూడో కాన్పులోనూ ఆడబిడ్డే.. చంపేసిన తండ్రి
Telangana | ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను కడతేర్చాడు. ఇప్పటికే తన భార్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వగా, మూడో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తీవ్ర

కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను కడతేర్చాడు. ఇప్పటికే తన భార్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వగా, మూడో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న తండ్రి తన మూడో కూతురిని చంపేశాడు. ఈ దారుణ ఘటన కాగజ్‌నగర్ పరిధిలోని లెనిగూడలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
మెస్రం బాపురావు అనే వ్యక్తి తన 40 రోజుల బిడ్డను చంపేసినట్లు కాగజ్‌నగర్ రూరల్ పోలీసులు నిర్ధారించారు. పసిపాపను సిమెంట్ రోడ్డుపై బలంగా పడేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాపురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

