DSC | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ):డీఎస్సీని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మెడలు వచ్చేందుకు ‘చలో ఢిల్లీ’కి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. అక్కడ రాహుల్‌గాంధీని కలిసి సమస్యలు వివరించి, వాయిదా కోరాలని నిర్ణయించారు.
వారు ఆ పనిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా డీఎస్సీ హాల్‌టికెట్లను వెబ్సెట్లో పెట్టేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నామని, అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులకు జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
దాదాపు 2.7 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ఆధార్ నంబర్ , పోస్టు క్యాటగిరీ, మాధ్యమం, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు https://tsdsc.aptonline.in/tsdsc/Hallticket ను చూడవచ్చు.