హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 31లోగా సర్కార్ తమతో చర్చలు జరిపి, డిమాండ్లను నెరవేర్చకుంటే సమరశంఖం మోగిస్తామని నిరుద్యోగ జేఏసీ స్పష్టంచేసింది. అశోక్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు కయ్య వెంకటేశ్, కాశీనాథ్ మాట్లాడుతూ సర్కార్ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే ‘కాంగ్రెస్ పార్టీ హటావో.. నిరుద్యోగి బచావో’ ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు.
గ్రామగ్రామాన కమిటీలు వేసుకొని కాంగ్రెస్‌ను తరిమికొట్టే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 15న 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.