మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో అండర్ బ్రిడ్జ్ రి డిజైనింగ్ పనులను స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
రాబోయే కాలంలో మరిన్ని నిధులతో అభివృద్ధి పరుస్తానని హామీనిచ్చారు. అంతకు ముందు ప్రజలు, వ్యాపార వర్గాలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ.. పటాకులు కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మర్నేని వెంకన్న, బాలు, చిట్యాల జనార్దన్, గోపి, సరస్వతి, సలీం, విజయ, బుజ్జి వెంకన్న, బోనగిరి గంగాధర్, గోగుల రాజు, రంగ్య, జన్ను మహేందర్, ప్రభాకర్, రవిచందర్, కొండ్ర ఎల్లయ్య, జానీ, విజయ్, వెంకట్రాం, గిరిధర్ గుప్తా, యాకయ్య, రమేష్, రాంజీ, మునీర్, తదితరులు పాల్గొన్నారు.