హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ జేఏసీ ఒత్తిడికి ఆర్టీసీ యాజమాన్యం దిగొచ్చి, పండుగ అడ్వాన్స్ చెల్లించడానికి అంగీకరించింది. గతంలో నిలిపివేసిన పండుగ అ డ్వాన్స్ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
దసరా అడ్వాన్స్‌గా క్లాస్-3 ఉ ద్యోగులకు 6 వేలు, క్లాస్-4 ఉద్యోగులకు 5,500 ఇవ్వనున్నట్టు పేర్కొంది. 25 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆర్టీసీ జేఏసీ చైర్మ న్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కోకన్వీనర్ యాదయ్య, సురేశ్ పేర్కొన్నారు.