కమ్మర్పల్లి, అక్టోబర్ 11 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉమ్మడి కోనాపూర్‌లో గులాబీ పార్టీపై అభిమానం గుబాళిస్తున్నది. కోనాపూర్, వాసంగట్టుతండా, కేసీ తండా లో కుల సంఘాలు, గిరిజన సంఘాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఉమ్మడి కోనాపూర్‌లో ఆదివారం మొదలైన ఏకగ్రీవాల పరంపర కొనసాగుతున్నది. గ్రామంలో పది కుల సంఘాలు ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు అందజేశాయి. బుధవారం కొత్త చెరువు తండా(కేసీ తండా) లోని 92 కుటుంబాల వారు మంత్రి వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ ప్రతిని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. ‘హమ్ నేనా సే సౌలత్ కర్ కిడోద్చా’ (తమకు ఎన్నో సౌకర్యాలు అందించిన మంత్రి వేములకు మా మద్దతు) అంటూ నినదించారు.