కొడిమ్యాల, నవంబర్ 3: చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతల్లపల్లి గ్రామస్థులు జై కొట్టారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి, సుంకె రవిశంకర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మాన కాపీని పార్టీ మండల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని, తమ గ్రామం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారని, దీనికి కృతజ్ఞతగా గ్రామం మొత్తం కారు గుర్తుకు ఓటు వేయాలని తీర్మానించిందని వెల్లడించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, పోలు రాజేందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సర్పంచ్ మల్యాల మహిపాల్, ఎంపీటీసీ సభ్యులు సామల్ల లక్ష్మణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ అంకం రాజేశం, పాదం శ్రీనివాస్, రాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.