జనగామ రూరల్, అక్టోబర్ 8 : ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వాసు (55) చేనేత వృత్తిని కొనసాగిస్తున్నాడు.
కుటుంబ అవసరాలు, చేనేత పనుల కోసం రూ.ఐదు లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వాసు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.