హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : విదేశీ చదువుల విషయంలో అగ్రరాజ్యం అమెరికా బాటలోనే యూకే పయనిస్తున్నది. భారతీయ విద్యార్థులపై ఆంక్షలు పెడుతున్నది. తాజాగా గ్రాడ్యుయేట్ రూట్ వీసా గడువును 24 నెలల నుంచి 18 నెలలకు తగ్గించింది. ఇటీవలే యూకే కేర్ వీసాలను రద్దు చేసింది. ఇదే కాకుండా కొత్తగా ఆరుశాతం పన్ను విధిస్తున్నది.
ఇలాంటి కొత్త నిబంధనలతో యూకేలో చదివేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. 2023 నుంచి 2024 మధ్య కాలంలో స్పాన్సర్డ్ స్టూడెంట్ వీసాలు 1.2లక్షల నుంచి 88,732కు తగ్గిపోయాయి. మన విద్యార్థులు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ దేశాలను ఎంచుకుంటున్నట్టు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.